టీడీపీ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం మాకు లేదు

బీటెక్‌ రవి మాటలను రికార్డుల నుంచి తొలగించాలి

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌

అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి వ్యాఖ్యలపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వికేంద్రీకరణపై శాసనమండలిలో బుధవారం చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదన్నారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొన్న చరిత్ర చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారని విమర్శించారు. చంద్రబాబుకు భగవంతుడు బుద్ధి చెప్పాలనే గత ఎన్నికల్లో 23మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీ సీట్లు వచ్చాయన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం తమకు లేదని మంత్రి తేల్చి చెప్పారు. బీటెక్‌ రవి అనుచితంగా మాట్లాడిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని విశ్వరూప్‌ కోరారు.

Back to Top