పింగళి కుమార్తె సీతామహాలక్ష్మి మృతికి  సీఎం వైయ‌స్ జగన్‌ సంతాపం

పల్నాడు: జాతీయ జెండా రూపకర్త దివంగత పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతా మహాలక్ష్మి (100) కన్నుమూశారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని ప్రియదర్శిని కాలనీలో ఉంటున్న ఆమె కుమారుడు జీవీ నరసింహారావు ఇంట్లో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. పింగళి సీతామహాలక్ష్మీ మృతి పట్ల ఏపీ సీఎం వైయ‌స్ జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. 

చాలా రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతు న్నారు. గత ఏడాది ఏపీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా మాచర్లకు వచ్చి ఆమెను సత్కరించి రూ.75 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆమెతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. 

తాజా వీడియోలు

Back to Top