నేడు సీఎం వైయ‌స్ జగన్‌తో సినీ పరిశ్రమ పెద్దల భేటీ

మంత్రి పేర్ని నాని

తాడేపల్లి: సినీ పరిశ్రమ పెద్దలు ఇవాళ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డితో​ భేటీ కానున్నారని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తెలిపారు. మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చాలా మంది ప్రముఖులు కలవాలని అనుకున్నారని.. కోవిడ్‌ కారణంగా తక్కువ మందితో భేటీ జరగనున్నట్లు చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్‌తో చర్చించనున్నారని.. సినిమా టికెట్ల రేట్లు ఫైనల్‌ కాలేదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top