ఉత్తరాంధ్ర, రాయలసీమ ద్రోహి చంద్రబాబు

రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు
 

అమరావతి: వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లును శాసన మండలి సెలెక్ట్‌ కమిటీకి పంపడం పట్ల రాష్ట్రవ్యాప్తగా నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. శాసన మండలి చైర్మన్‌ను టీడీపీ ప్రభావితం చేసిందంటూ రాష్ట్రప్రజలు మండిపడుతున్నారు. జిల్లా కలెక్టరేట్ల వద్ద ప్రతిపక్ష నేత చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబుపై ఆగ్రహ జ్వలలు మిన్నంటాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ ప్రజలు ముక్తకంఠంతో నిందిస్తున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబుపై భగ్గుమంటున్నారు. 

Back to Top