చంద్ర‌బాబు కుట్ర‌ల‌ను ప్ర‌జ‌లు గ్ర‌హించాలి

ఓట‌మి భ‌యంతోనే వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిప‌రుల ఓట్లు తొల‌గింపు..

కార్య‌క‌ర్త‌ల ఆత్మీయ స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత ర‌ఘురామ కృష్ణంరాజు

ప‌శ్చిమ‌గోదావ‌రి: చంద్ర‌బాబు ఓట‌మికి భ‌య‌ప‌డే వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిప‌రుల ఓట్ల‌ను తొల‌గిస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత ర‌ఘురామ కృష్ణంరాజు  విమ‌ర్శించారు.  కాళ్ల మండ‌లంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత ర‌ఘురామ రాజు ఆధ‌ర్వ్యంలో కార్య‌క‌ర్త‌ల ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  ఫాం-7 పేరుతో రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న కుట్ర‌ల‌ను ప్ర‌తిఒక్క‌రూ గ‌మ‌నించి త‌మ ఓటు ఉందోలేదో స‌రిచూసుకోవాల‌ని సూచించారు.నా ఇంట్లో,ఒంట్లో వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉంటార‌ని, అందుకే త‌న మ‌న‌వ‌డికి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అని పేరు పెట్టిన‌ట్లు తెలిపారు.ప్ర‌తి ఒక్క‌రూ వైయ‌స్ఆర్‌సీపీ గెలుపున‌కు  కృషిచేయాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు.ఈ కార్య‌క్ర‌మంలో గ్రంథి శ్రీనివాస్‌,మోసేష్ రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top