చిరస్థాయిగా నిలిచేలా చంద్రబాబు ఒక్క పథకమైనా తెచ్చారా? 

చిరస్థాయిగా నిలిచేలా చంద్రబాబు ఒక్క పథకమైనా తెచ్చారా? 

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లా:   చంద్ర‌బాబు 2014 ఎన్నికల్లో  600 హామీలు ఇచ్చి మోసం చేశార‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజల కోసం చిరస్థాయిగా నిలిచేలా చంద్రబాబు ఒక్క పథకమైనా తెచ్చారా? అని ప్రశ్నించారు.  మడకశిరలో వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రి శంకర్ నారాయణ, జెడ్పీ చైర్మన్ బోయగిరిజమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 
మరోవైపు మూడేళ్లలో 98.44 శాతం హామీలను నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే గ్రామ, వార్డు సచివాలయాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. సీఎం వైయ‌స్ జగన్ పాలనపై ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడేవారికి గుర్తింపు ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీకి 175కు 175 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Back to Top