విజయవాడ నగర అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 

విజయవాడ: నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారరని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.  ఐదేళ్లలో విజయవాడను ఆదర్శనగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. బుధవారం విజయవాడలో కేఎల్‌ రావు హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ నుంచి రాణిగారి తోట వరకు ఆరున్నర కోట్లతో మంచినీటి పైప్‌లైన్‌ పనులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభానుతో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. వీరికి మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండని కోరారు. ఈ కార్యక్రమానికి వైస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్‌ దేవినేని అవినాష్‌, నగరాధ్యక్షులు బొప్పన భవకుమార్‌ హాజరయ్యారు.

తాజా ఫోటోలు

Back to Top