జీడీ నెల్లూరు నియోజకవర్గంలో శాంతియుత నిర‌స‌న‌

చిత్తూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ జీడీ నెల్లూరు నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీడీ నెల్లూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇంచార్జి కృపాలక్ష్మి నాయకత్వం వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కే.నారాయ‌ణ‌స్వామి పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కృపాలక్ష్మి మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి భారీ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం గళం వినిపించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top