పవన్ వ్యాఖ్యలు ఆయన అజ్ఞానాన్ని సూచిస్తున్నాయి

మంత్రి అప్పలరాజు
 
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయాలనేని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

బీజేపీని వదిలేసి వైయ‌స్ఆర్‌ సీపీని పవన్ విమర్శిస్తున్నారు

విశాఖ‌:   వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలు ఆయన అజ్ఞానాన్ని సూచిస్తున్నాయని  మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు విమ‌ర్శించారు.   స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ ఇన్ని రోజులు గుడ్డి గాడిద పళ్లు తోమారా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలనుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమని... అలాంటప్పుడు బీజేపీని ప్రశ్నించాలని అన్నారు.
 
బీజేపీని పవన్ కల్యాణ్ ఒక్క మాట కూడా అనడం లేదని అప్పలరాజు విమర్శించారు. వ్రైవేటీకరణ అంశంలో వైయ‌స్ఆర్‌సీపీకి సంబంధం లేకపోయినా తమ పార్టీపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్న బీజేపీకి తిరుపతి, బద్వేల్ ఎన్నికల్లో పవన్ ఎలా మద్దతిచ్చారని ప్రశ్నించారు. 

తాజా ఫోటోలు

Back to Top