పసుపు – కుంకుమ పచ్చి మోసం

మహిళలు అప్రమత్తంగా ఉండాలి

విశాఖలో వైయస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

విశాఖపట్నం: మహిళలు అప్రమత్తంగా ఉండాలని, పసుపు – కుంకుమ పేరుతో మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు వస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా నాయకురాలు కిల్లి కృపారాణి అన్నారు. విశాఖపట్నం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ సీపీ నేతలు కిల్లి కృపారాణి, వరుదు కల్యాణి, అవంతి శ్రీనివాస్, కొయ్య ప్రసాద్, కేకే రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. అనంతరం కిల్లి కృపారాణి మాట్లాడుతూ.. పసుపు – కుంకుమ పెద్ద కుంభకోణమన్నారు. మహిళలకు ఎప్పుడో అందాల్సిన డబ్బును ఎన్నికలు వస్తున్నాయని పప్పు బెల్లాల మాదిరిగా పంచుతున్నారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పావలా వడ్డీకే రుణ సదుపాయం కల్పించారని, మహిళాభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత డ్వాక్రా సంఘాలు రోడ్డున పడ్డాయన్నారు. 

Back to Top