ప్లీన‌రీ అంటే పార్టీ పండుగ 

స్వచ్ఛందంగా సమన్వయంతో పనిచేయాలి

పార్టీకి, ప్రభుత్వానికీ మంచి పేరు తేవాలి

పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, వివిధ‌ కార్పొరేషన్ చైర్మ‌న్లతో సమావేశం

ప్లీన‌రీ అంశాల‌పై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి దిశానిర్దేశం 

తాడేప‌ల్లి:  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలలో పాల్గొనేందుకు కార్యకర్తలందరూ ఉత్సాహం చూపుతున్నారని, వారి ఉత్సాహానికి అనుగుణంగా అందరూ అంకితభావంతో పనిచేసి ప్లీనరీ సమావేశాలను వేడుకలా నిర్వహించాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, బీసీ, జనరల్‌ కార్పొరేషన్ చైర్మ‌న్ల‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారందరికీ దిశా నిర్ధేశం చేసి బాధ్యతలు అప్పగించారు. సమావేశంలో ప్లీనరీకి సంబంధించి పలు అంశాలను సమీక్షించారు. సమావేశానికి పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు లేళ్ల‌ అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.

ఈ సమావేశంలో విజయసాయిరెడ్డి ఏం మాట్లాడారంటే..

పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలోనే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథ‌కాలు సక్సెస్‌ ఫుల్‌గా అమలు చేస్తున్నాం. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు మేలు, ఆర్థిక‌ లబ్ధి చేకూర్చుతున్నాం. మహిళలకు అన్ని రంగాలలో సమాన వాటా కల్పిస్తున్నాం. సమాజంలో వెనకబడిన బిసిలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు సమాజానికి బ్యాక్ బోన్ కులాలుగా బలోపేతం చేయడం జరిగింది. అదే విధంగా ఎస్టి, ఎస్టి, మైనారిటీ వర్గాలకు సముచిత స్థానం కల్పించడం జరిగింది. దేశ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో మంత్రివర్గంలో 70 శాతంపైగా ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ వర్గాలకు స్థానం కల్పించిన ఘనత సీఎం వైయస్ జగన్‌దే. అన్ని వర్గాలలో కూడా అట్టడుగున ఉన్న కుటుంబాలకు సంక్షేమ పథ‌కాల ద్వారా లబ్ది చేకూర్చడం జరిగింది. 

ఈ క్రమంలో పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు 8, 9వ తేదీలలో రెండ్రోజుల పాటు జరుగనున్న ప్లీనరీ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వీటిని జయప్రదం చేయడం మన బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలి. స్వచ్ఛందంగా ముందుకొచ్చి పూర్తి సమన్వయంతో పని చేయాలి. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఇటు పార్టీకి, అటు ప్రభుత్వానికీ మంచి పేరు తెచ్చే విధంగా ప్లీనరీని జయప్రదం చేయాలి. 

పార్టీ కేంద్ర కార్యాల‌య ప‌ర్య‌వేక్ష‌కులు, ఎమ్మెల్సీ లేళ్ల‌ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. గడచిన మూడేళ్ళ కాలంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించుకుని, రానున్న కాలంలో మరింత మెరుగైన పాలన అందించే దిశగా జరుగనున్న ప్లీనరీ ప్రాముఖ్యతను అంతా సవ్యంగా అర్థం చేసుకోవాల‌న్నారు. ఎందుకంటే విపక్షాలు అసత్యాలతో విషప్రచారం చేస్తున్నాయ‌ని, దానికి విరుద్ధంగా మనం ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. పార్టీ మేనిఫెస్టోలో 95శాతం పైగా అమలు చేసిన సత్యాన్ని ప్రజలకు అర్థ‌మయ్యేలా వివరించాలని సూచించారు. అందుకు ప్లీనరీ చక్కని వేదిక కావాల‌ని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ప్లీనరీ జయప్రదానికి కంకణబద్ధులు కావాలి అని కోరారు. 

Back to Top