సీఎం వైయస్‌ జగన్‌కు హృద‌య‌పూర్వ‌క‌ ధన్యవాదాలు

రాజ్యసభ సభ్యుడిగా విజయం సాధించిన పరిమళ్‌ నత్వానీ

అమరావతి: రాజ్యసభ సభ్యుడిగా తనను పార్లమెంట్‌కు పంపిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించిన పరిమళ్‌ నత్వానీ ధన్యవాదాలు తెలియజేశారు. రాజ్యసభ సభ్యుడిగా విజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకంతో తనకు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పార్లమెంట్‌లో పోరాడుతానని, రాష్ట్రానికి సంబంధించి అన్ని హక్కులను సాధించేందుకు వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలతో కలిసి కృషిచేస్తానన్నారు.  
 

Back to Top