బీజేపీ, కాంగ్రెస్‌ ఏపీకి తీరనిద్రోహం చేశాయి

అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం వైయస్‌ జగన్‌ కృషిచేస్తున్నారు

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తీరని ద్రోహం చేశాయని బద్వేల్‌ ఉప ఎన్నిక వైయస్‌ఆర్‌ సీపీ ఇన్‌చార్జ్, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ ఏపీకి చేసిన అన్యాయానికి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ కనుమరుగైందన్నారు. బీజేపీ రాజకీయం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. బద్వేలులో మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం బద్వేలులో సాగు, తాగునీటి సమస్యను పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్ని వర్గాల సంక్షేమానికి కృషిచేస్తున్నారని చెప్పారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని, ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top