సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గొప్ప దార్శనికులు

ఎడెక్స్ సీఈవో పద్మశ్రీ అనంత్ అగర్వాల్ 

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అవకాశాలను కల్పిస్తుంద‌ని ఎడెక్స్ సీఈవో పద్మశ్రీ అనంత్ అగర్వాల్ పేర్కొన్నారు. సంపన్నుల పిల్లలకు చాలా అవకాశాలు వస్తాయి. వాళ్లు డబ్బు ఖర్చుచేసి మంచి కోచింగ్ సెంటర్లకు వెళ్లి నేర్చుకోగలరు. కాని మంగుళూరులో పుట్టిన నాలాంటి సాధారణ వ్యక్తికూడా అంటే ఈ రాష్ట్రంలోని ప్రతి సామాన్యుడికీ కూడా గొప్ప అవకాశాలను సీఎం తన దార్శనికత ద్వారా కల్పిస్తున్నార‌ని చెప్పారు. ఎడెక్స్‌తో ఏపీ ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకుంది. 

ఈ సంద‌ర్భంగా ఎడెక్స్ సీఈవో అనంత్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ..

 • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.
 • నాణ్యమైన విద్యను ప్రతి విద్యార్ధికీ అందుబాటులోకి తీసుకోవాలన్న ముఖ్యమంత్రిగారి దార్శనికత ఇవాళ వాస్తవరూపంలోకి వస్తోంది.
 • పదేళ్ల క్రితం ఎడెక్స్ ప్రయాణం ప్రారంభమైంది.
 • నేను విదేశాల నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు అక్షయ్ అన్న విద్యార్ధి నన్ను గుర్తుపట్టి నాతో చాలాసేపు తన అనుభవాలను పంచుకున్నాడు. 
 • వివిధ యూనివర్శిటీల సౌజన్యంతో అందిస్తున్న కోర్సులు తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని అంటూ నాకు ధన్యవాదాలు చెప్పాడు.
 • ఓ స్థానిక కాలేజీలో ఓ మాదిరిగా పాసయ్యాడు. రెండేళ్లపాటు ఉద్యోగం కోసం ఎదురుచూశానని చెప్పాడు.
 • చివరకు కెరీరమీద ఆశలు వదులుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. 
 • తర్వాత ఎడెక్స్లో ఎంఐటీ రూపొందించిన పైథాన్ కోర్సు నేర్చుకున్నాడు. 
 • క్లౌడ్ కంప్యూటింగ్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోర్సు నేర్చుకున్నాడు. 
 • ఉద్యోగానికి దరఖాస్తు చేయగానే వెంటనే ఇంటర్వ్యూలకోసం కాల్స్ రావడం మొదలుపెట్టాయని చెప్పాడు. 
 • తన దరఖాస్తులో ఎంఐటీనుంచి సర్టిఫికెట్ ఉందని చూసి, ఇంటర్వ్యూలో ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ అతనికి ఉద్యోగం ఇచ్చారు. 
 • తర్వాత ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. 
 • ఏపీలోని ప్రతివిద్యార్థికి కూడా అక్షయ్లాంటి వ్యక్తికి వచ్చిన అవకాశాలు అందాలని నేను కోరుకుంటున్నాను. 
 • ఏపీలోని ప్రతివిద్యార్థికీ అక్షయ్కు ఎలాంటి అవకాశం వచ్చిందో, అలాంటి అవకాశం దక్కాలని ముఖ్యమంత్రి తపిస్తున్నారు.
 • ఏపీలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 12 లక్షల మందికి కూడా ఇలాంటి అవకాశం రావాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు.
 • ఉన్నత విద్యారంగంలో ఇది గేమ్ ఛేంజర్.
 • ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం ప్రతి ఒక్కరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అవకాశాలను కల్పిస్తుంది.
 • సంపన్నుల పిల్లలకు చాలా అవకాశాలు వస్తాయి. వాళ్లు డబ్బు ఖర్చుచేసి మంచి కోచింగ్ సెంటర్లకు వెళ్లి నేర్చుకోగలరు.
 • కాని మంగుళూరులో పుట్టిన నాలాంటి సాధారణ వ్యక్తికూడా అంటే ఈరాష్ట్రంలోని ప్రతి సామాన్యుడికీ కూడా గొప్ప అవకాశాలను సీఎం తన దార్శనికత ద్వారా కల్పిస్తున్నారు. 
 • ఉన్నత విద్యలో నాణ్యమైన విద్యను అందించాలన్నది ముఖ్యమంత్రిగారి విజన్.
 • 36 ఏళ్లపాటు ప్రొఫెసర్గా ఉన్న నన్ను ముఖ్యమంత్రిగారి ఆలోచనలు, విజన్ ఆశ్చర్య పరిచాయి. 
 • గౌరవ ముఖ్యమంత్రిగారు, ఎడెక్స్తోనూ, నాతో సంప్రదించి ఉన్నత విద్యలో నాణ్యమైన విద్యను అందించడంపై తన ఆలోచనలను పంచుకున్నారు. 
 • ఎంఐటీ, హార్వర్డ్ లాంటి యూనివర్శిటీల స్థాయిలో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికీ కూడా నాణ్యమైన విద్యను ఎలా అందించగలనని సీఎం నాతో అన్నారు.
 • డిజిటల్ టెక్నాలజీని వాడుకుని ఆ స్థాయి విద్యను ఎలా అందించగలనని నాతో చర్చించారు.
 • ఆక్షణంలో నాకు ఆ అక్షయ్ కథే గుర్తుకు వచ్చింది.
 • వెంటనే మాతో ఆగస్టులో ఎంఓయూతో ఒప్పందం చేసుకున్నారు.
 • ఎడెక్స్తో ఈరోజుచేసుకున్న ఒప్పందం ఆంధ్రప్రదేశ్ను విద్యారంగంలో మొదటిస్థాయిలో నిలబెడుతుంది.
 • విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు.
 • విజ్ఞానంలో, ఆర్థిక ప్రగతిలో, మంచి పౌరుడిగా తీర్చిదిద్దడంలో విద్య అన్నది అత్యంత ప్రధానం.
 • అయితే విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చినప్పుడే ఆ హక్కను అందరికీ అందినట్టు అవుతుంది.
 • కేవలం సంపన్నులకు మాత్రమే అందుబాటులోకి తీసుకు వస్తే విద్యా హక్కును కల్పించినట్టుకాదు. 
 • గాలినుంచి ఆక్సిజన్ ధనిక, పేద ఎలాంటి తేడాలేకుండా పీల్చుకోగలుగుతున్నారో, విద్యకూడా ఎలాంటి అంతరాలు లేకుండా అందరికీ అందాలి.
 • అంతేకాక అత్యుత్తమ నాణ్యమైన విద్యకూడా అందరికీ అందాలి. 
 • అత్యుంత నాణ్యమైన విద్య అందాలన్న ముఖ్యమంత్రిగారి దార్శినికత ఎడెక్స్తో నెరవేరుతుందని నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను.
 • ఎడెక్స్ ఫ్లాట్ఫాం ద్వారా అత్యుత్తమ నాణ్యమైన విద్యను నేర్చుకోగలుగుతారు.
 • కోర్సులను నేర్చుకోవడమేకాక అభ్యాసంలోకూడా ఎడెక్స్ కీలక పాత్ర పోషిస్తుంది.
 • ఏపీలోని 12 లక్షలమందికి ఎడెక్స్ అందుబాటులోకి వస్తుంది.
 • కాలేజీల్లోని యువ విద్యార్థులు ఎడెక్స్ ద్వారా నేర్చుకోగలుగుతారు.
 • మెరుగైన నైపుణ్యాలు అలవడుతాయి. 
 • తన రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఎడెక్స్తో ఒప్పందం చేసుకున్న రాష్ట్రాల్లో దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగాకూడా ఆంధ్రప్రదేశ్ మొదటిది.
 • ఏపీ విద్యారంగంలో సీఎం జగన్ తీసుకొచ్చిన విధానాలను త్వరలో వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాలు కూడా పాటిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 
 • స్థానిక కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులు ప్రపంచఅత్యుత్తమ యూనివర్శిటీల్లో బోధించే అధ్యాపకుల పాఠాలను కూడా వినగలుగుతారు, నేర్చుకోగలుగుతారు.
 • ఆయా ప్రపంచస్థాయి యూనివర్శిటీల సర్టిఫికెట్లనుకూడా సాధించగలుగుతారు.
 • తొలిసారిగా ఇది ఏపీలో జరగబోతోంది.
 • పాఠ్యప్రణాళికను సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి నా సహాయాన్ని ముఖ్యమంత్రి కోరారు. నా పూర్తి సహకారాన్ని అందిస్తాను.
Back to Top