టీడీపీ పాలనను తరిమికొట్టాలి

వైయస్‌ఆర్‌సీపీ నవరత్నాలతో అందరికి మేలు

వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే గిరిజన ప్రాంతాల అభివృద్ధి

వైయస్‌ఆర్‌సీపీ పాడేరు అసెంబ్లీ అభ్యర్థి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి

పాడేరు:వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైయస్‌ఆర్‌సీపీ పాడేరు అసెంబ్లీ అభ్యర్థి కొట్టగుళ్లి  భాగ్యలక్ష్మి అన్నారు. రాష్ట్రంలో టీడీపీ అరాచక పాలన సాగిస్తోందన్నారు.టీడీపీ పార్టీ  డబ్బుతో గెలవడానికి ప్రయత్నాలు చేస్తోందని,ప్రజలను మభ్యపెట్టడానికి టీడీపీ నేతలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తుందన్నారు.టీడీపీ పాలనను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాజన్న రాజ్యం రావాలంటే వైయస్‌ జగన్‌ సీఎం కావాలని కోరారు.  వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన నవరత్నాలతో ప్రజలందరికి మేలు జరుగుతుందన్నారు.  

Back to Top