ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను ప్రారంభించిన టీటీడీ చైర్మ‌న్ 

 
తిరుప‌తి:  తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణములో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాజువాలిటీ వార్డ్ ,  ఆక్సిజన్ ప్లాంట్ ను  టీటీడీ చైర్మన్  వైవీ సుబ్బారెడ్డి  ప్రారంభించారు. అనంత‌రం క్యాజువాలిటీ వార్డు, ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ప‌రిశీలించారు. ఆసుప‌త్రిలో రోగుల‌కు అందుతున్నసేవ‌ల‌పై ఆరా తీశారు. కోవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌క పాటించాల‌ని సూచించారు.  రాష్ట్రంలో క‌రోనా కట్ట‌డికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకుంటున్న చ‌ర్య‌లు దేశానికే ఆద‌ర్శంగా ఉన్నాయ‌ని చెప్పారు. కార్య‌క్ర‌మంలో తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top