ప్ర‌జారంజ‌కపాల‌న‌కు ఏడాది

సంక్షేమం, అభివృద్ధి దిశలో సీఎం వైయస్‌ జగన్‌ ముందడుగులు 

మేనిఫెస్టోలోని 90 శాతం హామీలు నెరవేర్చిన అనితర సాధ్యుడు

ప్రజల గుమ్మం ముందుకే ప్రతి సంక్షేమ పథకం

గతం గోతులను పూడుస్తూ కొత్త పునాదులు
స్వచ్ఛమైన పాలనకు అచ్చమైన నిర్వచనం ఈ సంవత్సరకాలం

2019 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ భారీ మెజార్టీతో గెలిచింది. మే 30న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రజలు ఆయనపై అపార నమ్మకాన్ని పెంచుకున్నారు. ఆయన సైతం ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరాలని గట్టిగా సంకల్పించుకున్నారు. 

చరిత్ర సృష్టించిన వైయస్‌ జగన్‌ సుదీర్ఘ పాదయాత్ర అనుభవాలు, భవిష్యత్‌ పాలనకు దార్శనికపత్రంగా మారాయి. మేనిఫెస్టోను తీర్చిదిద్దడంలో ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రజాక్షేత్రంలో అనుభవాలు.. పాలనలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలై అందరికీ చేరువవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు నడుస్తోంది ప్రజా ప్రభుత్వం. ప్రజలందరి ప్రభుత్వం. 

పదేళ్ల రాజకీయ ప్రస్థానం.. ప్రజలతో మమేకమయి సాగిన జీవితం.. ప్రజల అవసరాలు తెలిసిన అనుభవం.. వర్తమానం చీకట్లను పారదోలి.. భవిష్యత్‌ వెలుగుల్ని సాధించే లక్ష్యం. ఓ యువనాయకుడిగా, ఓ ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ భుజస్కందాలపై పెద్ద బాధ్యతలే మోయాల్సి వచ్చింది. కానీ, ఓ చిరునవ్వే సమాధానమయింది. అనుకున్నవి సాధించాలన్న సంకల్పం మరింత దృఢమైంది. ప్రతి పేదవాడి మోములో చిరునవ్వు చూడాలని.. వ్యవసాయం దండగ కాదు.. పండుగ కావాలని.. సుపరిపాలన సాగించాలని మనసులో గట్టిగా సంకల్పించుకున్న యువనేత. ఏడాది కాలంగా ఆ దిశలోనే అడుగులు వేస్తున్నారు. తను హామీ ఇచ్చినట్టే.. సంక్షేమ నవరత్నాలను అర్హులందరికీ అందించాలన్న వజ్ర సంకల్పం పూనారు.

ప్రమాణ స్వీకారం మరుక్షణం నుంచే తను హామీ ఇచ్చినట్టుగానే పెన్షన్లను రూ.2,250  పెంచుతూ సీఎం వైయస్‌ జగన్‌ మొదటి సంతకం చేశారు. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్నికల్లో తనిచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. వైయస్‌ఆర్‌ రైతు భరోసా, వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక, గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ, వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా, ఆరోగ్యశ్రీ, వైయస్‌ఆర్‌ కంటి వెలుగు, అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన ఇలా ఒకటా.. రెండా ఎన్నెన్నో సంక్షేమ పథకాలను తొలి ఏడాది నుంచే ప్రజలకు అందించడం మొదలు పెట్టారు. 

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 90 శాతం నెరవేర్చిన అనితర సాధ్యుడిగా నిరూపించుకున్నారు. కాసులతో కళకళలాడే ఖజానా అందుబాటులో లేకున్నా, ప్రజల కోసం రాజీలేని ధోరణిలో ఏపీ సంక్షేమసారధి అడుగులు ముందుకే పడుతున్నాయి. విపక్షం అవాకులు చెవాకుల ప్రేలాపనలతో ఎగిరెగిరి పడుతున్నా.. తొణకని బెణకని నైజంతో దృఢంగా వ్యవహరిస్తున్నారు సీఎం వైయస్‌ జగన్‌. తను సంకల్పించిన సంక్షేమ, అభివృద్ధి పనుల్లో ముందుకు దూసుకుపోవటమే ఆయనకు తెలిసిన నైజం. విలువలతో కూడిన రాజకీయం అదరదు.. బెదరదు.

ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడటం తన కర్తవ్యంగా భావిస్తోంది వైయస్‌ జగన్‌ ప్రభుత్వం. ప్రాజెక్టుల విషయంలో రివర్స్‌టెండరింగ్‌ అన్నది ఆ దిశలో సాగుతున్న మంచి ప్రయత్నం. రైతన్నలు, నేతన్నల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వరకు ఈ ఏడాది కాలం ప్రభుత్వం అందించిన చేయూత గణనీయమైనది.. 

ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశలో ఏర్పాటు చేసిన ‘స్పందన’ కార్యక్రమం ఒక్కటి చాలు.. ఈ పాలన తీరుతెన్నులు పట్టిచూపడానికి.. విద్య, వైద్యం విషయంలో వైయస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్ణయాలు పాలనలోని మానవీయ కోణానికి అద్దం పడుతున్నాయి. 

14 నెలల పాటు సాగిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర ఓ చరిత్ర. చంద్రబాబు పాలన డొల్లతనాన్ని పట్టిచూపిన పాదయాత్ర. కోటలు దాటే మాటలతో ఐదేళ్ల పదవీ కాలాన్ని హారతి కర్పూరంలా కరిగించేశారు చంద్రబాబు. అన్ని రంగాల్లో అయినకాడికి దోపిడీ పర్వాలకు తెరలేపారు. ఖజానాను ఖాళీ చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం నవ్యాంధ్రప్రదేశ్‌ జవసత్వాలను పీల్చిపిప్పిచేసింది. ఈ దశలో పాలనా పగ్గాలు చేపట్టిన వైయస్‌ జగన్, గతం గోతులను పూడుస్తూ కొత్త పునాదులు వేయాల్సిన బాధ్యత మోస్తున్నారు. అదే సమయంలో వేగంగా సంక్షేమ పథకాలు అందించడంలో చొరవ చూపుతున్నారు. అభివృద్ధి పథకాల విషయంలో సరైన, సవ్యమైన ఆలోచనలు చేస్తున్నారు. 

చర్చలు, సమావేశాలు, పథకాలు, ప్రణాళికలు.. ఏ ఒక్కరోజూ వృథా కాకుండా ఓ చైతన్య ప్రవాహంలా సాగుతోంది ప్రజాపాలన. ఆర్థిక కష్టాలు ఎన్ని ఉన్నా, ఓ ఇంటి పెద్దలా ప్రజలకు అన్నీ సమకూర్చిపెట్టాలని తపిస్తున్నారు సీఎం వైయస్‌ జగన్‌. సంక్షేమ పథకాల విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు దేశంలోనే చర్చనీయాంశాలవుతున్నాయి. స్వచ్ఛమైన పాలనకు అచ్చమైన నిర్వచనంలా తన పాలన ఉండాలన్న తాపత్రయం రాష్ట్ర ముఖ్యమంత్రిది. ఆ తాపత్రయం ఆయన ప్రతి మాటలోనూ ధ్వనిస్తూనే ఉంది. 

కనీసం నీడ స్థాయి కూడా లేదు. అయినా వెంటాడే నీడనునేనని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్షం గప్పాలు కొడుతూనే ఉంది. గతంలో మే మింత.. మే మంత పొడిచేశామంటూ డప్పు కొట్టుకుంటోంది. రోజూ పిల్లి శాపాలు పెట్టడమే పనిగా పెట్టుకుంది. ప్రభుత్వానికి ఏదైనా సమస్య వస్తే చంకలు గుద్దుకోవడం అత్యంత హేయం. ఏడాదికాలంగా ఇదే చోద్యం. ప్రజా వ్యతిరేక పాలన సాగించింది కాక, ఇప్పుడు ప్రజా వ్యతిరేక ప్రతిపక్షంగా పనిచేయడం టీడీపీని ప్రజల్లో దోషిగా నిలబెడుతోంది. విదేశీ పర్యటనలు, ఈవెంట్‌ల పేరుతోనే కాకుండా రాష్ట్రం కోసం అంటూ గత ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్ల అప్పు పెట్టడమే కాకుండా.. అటు కాంట్రాక్టర్లకు, ఇటు ప్రొఫెషనల్‌ కాలేజీలకు, కరెంటు సంస్థలకు వేల కోట్ల అప్పులు మిగిల్చిపోయింది. ఓ వైపు అప్పులు తీర్చడం ఇప్పటి ప్రభుత్వం పనిగా మారింది. 

అప్పుల కుప్పగా మిగిలిన రాష్ట్రం. అయినా సరే ఓ వైపు సంక్షేమ పథకాలు.. మరోవైపు అభివృద్ధి పథకాల విషయంలో ముఖ్యమంత్రి ఆలోచనలు ముందుకే సాగాయి. ప్రజలు సైతం ఊహించని తీరులో వారికి సంక్షేమ పథకాలు నవరత్నాలై ఇంటి ముంగిటికి వచ్చాయి. విద్యారంగంలో విప్లవాత్మక చర్యలు చేపట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీని కనివినని రీతిలో పటిష్టం చేయడం... రాష్ట్రంలో మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో కూడిన ప్రణాళికలు చేశారు ప్రజానేత. ముఖ్యమంత్రిగా ఏడాది కాలంలోనే ఫ్రూవ్‌ చేసుకుంటానంటూ చెప్పిన వైయస్‌ జగన్‌ ఇప్పటి దాకా చేసిన పనులు.. తనదైన పాలనా తీరు అటు విమర్శకుల్ని.. ఇటు రాజకీయ మేధావుల్ని సైతం ఆలోచించేలా చేస్తోంది.. ప్రశంసించేలా చేస్తోంది. 

మొదటిసారి ముఖ్యమంత్రి. మరోవైపు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా. కరోనా కట్టడి విషయంలోనూ, ప్రజలను కాపాడుకోవాలన్న తాపత్రయంలోనూ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తనదైన ముందుచూపుతో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ లక్షలాది వలంటీర్లను ప్రభుత్వానికి ఉపయోగపడేలా చేసింది. సంక్షేమ పథకాలను ఇంటింటికి అందజేయటం దగ్గర్నుంచి కరోనా కష్టకాలం వరకూ ఆ వ్యవస్థ గొప్పగా ఉపయోగపడింది... ఉపయోగపడుతోంది. 

అటు అధికార వ్యవస్థకు దిశా నిర్దేశం చేస్తూ.. ఇటు మంత్రి మండలిని నడిపిస్తూ.. ఎమ్మెల్యేలకు లక్ష్యాలను నిర్దేశిస్తూ.. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల పథకాల అమలుకు తేదీల వారీగా క్యాలెండర్‌ ప్రకటించిన సాహసి.. ప్రజా ప్రేమికుడు మా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కాకుండా ఇంకెవరు? అంటున్నారు ఏపీ ప్రజలు.

Back to Top