‘ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’

పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రాజమండ్రిలో భారీ ర్యాలీ

పాల్గొన్న మంత్రి రంగనాథరాజు, ఎంపీ భరత్‌

తూర్పుగోదావరి: పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రాజమండ్రిలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంట్‌ సభ్యుడు మార్గాని భరత్‌ ఆధ్వర్యంలో కోటగుమ్మం జంక్షన్‌ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కోఆర్డినేటర్‌ శివరామ సుబ్రహ్మణ్యం, వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్, మంత్రి రంగనాథరాజు మాట్లాడుతూ.. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు.

 

Back to Top