సీఎం వైయస్‌ జగన్‌కు ప్రశంసల వెల్లువ

దిశ చట్టంపై ఒడిశా రాష్ట్రం హర్షం
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశానికే దిశా నిర్దేశం చేసే దిశ చట్టాన్ని ఏపీ అసెంబ్లీలో ఆమోదించడం పట్ల పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం వైయస్‌ జగన్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నారు. మహిళలకు భద్రత కల్పించేందుకు దిశ చట్టాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌హన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం అయ్యాయి. మంగళవారం సమావేశాలు ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ సభాపతి తమ్మినేని సీతారాం దిశ చట్టాన్ని అమోదించిన సభకు అభినందనలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయన్నారు. దిశ చట్టం ప్రతులను పంపాలని ఒడిశా ప్రభుత్వం తమను కోరినట్లు స్పీకర్‌ తెలిపారు. చట్టాన్ని యధాతథంగా అమలు చేస్తామని ఆ ప్రభుత్వం చెప్పినట్టు సభలో వెల్లడించారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం కూడా చట్టం గురించి తమను సంప్రదించిందని స్పీకర్‌ తెలిపారు. దిశ చట్టం ఆమోదించడం అసెంబ్లీకి గర్వకారణమన్నారు. ఈ చట్టంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోందన్నారు.  
 

తాజా ఫోటోలు

Back to Top