అక్టోబర్‌ 1 నుంచి నూతన ఎక్సైజ్‌ విధానం

800 మద్యం షాపుల తొలగింపు

దశలవారీగా మద్యపాన నిషేధం

అమరావతి: ఎన్నికలకు ముందు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన మద్యపాన నిషేదం హామీ అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దశలవారీగా మద్యపాన నిషేదంలో భాగంగా షాపుల తగ్గింపునకు చర్యలు తీసుకుంది.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వం నూతన ఎక్సైజ్‌ విధానాన్ని ప్రకటించింది. అక్టోబర్‌ 1 నుంచి కొత్త విధానంలో మద్యం విక్రయాలు బేవరేజస్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మద్యం షాపుల నిర్వహణ ఉంటుంది. 3500 షాపులను బేవరేజేస్‌ కార్పొరేషన్‌ నిర్వహించనుంది. 800కు పైగా మద్యం షాపులను ప్రభుత్వం తగ్గించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి అలిపిరి మార్గంలో మద్యం షాపులు నిషేధించారు. శ్రీవారి భక్తుల మనోభావాలకు అనుగుణంగా మద్యం షాపులు తొలగిస్తున్నారు. ఎక్కడా బెల్టు షాపులు లేకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

Back to Top