కూటమి నేతల జేబులు నింపడానికే లిక్కర్ టెండర్లు

ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు దేవినేని అవినాష్

తాడేపల్లి: కూటమి నేతల జేబులు నింపడానికే  చంద్ర‌బాబు లిక్కర్ టెండర్లు పిలిచార‌ని వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ విమ‌ర్శించారు. కూటమి లిక్కర్ టెండర్లపై వైయ‌స్ఆర్‌సీపీ నేత దేవినేని అవినాష్ మండిపడ్డారు. లిక్క‌ర్ టెండర్లలో షాపులు దక్కించుకున్న వారిని కూటమి నేతలు బెదిరిస్తున్నారని.. కొన్ని నియోజకవర్గాల్లో 30 శాతం కమీషన్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నార‌ని తెలిపారు. మరికొందరు బరితెగించి టెండర్ దక్కించుకున్న వారిని కిడ్నాప్ చేస్తున్నారని మండిప‌డ్డారు.
కాగా, తాడేపల్లిలో మద్యం షాపును మహిళలు అడ్డుకున్నారు. ఆశ్రమం రోడ్డులో ఇళ్ల మధ్య మద్యం షాపు ఏర్పాటు​ చేయడాన్ని వ్యతిరేకిస్తూ  మహిళలు రోడ్డెక్కారు. మద్యం షాపులకు వ్యతిరేకంగా మహిళలు, స్థానికుల నినాదాలు చేశారు.

పేద మహిళల కళ్లలో ఆనందం చూడటమే అప్పటి జగన్ ప్రభుత్వ లక్ష్యం. చంద్రబాబు కుటీల రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని అవినాష్‌ అన్నారు.

Back to Top