వైయస్‌ఆర్‌సీపీలోకి ఏలూరు మేయర్‌ నూర్జహాన్‌

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌సీపీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఏలూరు మేయర్‌ నూర్జహాన్, ఆమె భర్త పెదబాబు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వైయస్‌ జగన్‌ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ సీఎం కావాలని అందరూ భావిస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌సీపీతోనే న్యాయం జరుగుతుందని చెప్పారు. వైయస్‌జగన్‌ను సీఎం చేసేందుకు తాము కూడా భాగస్వాములమవుతామని పేర్కొన్నారు. అంతకుముందు బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ రామచంద్రయ్య యాదవ్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కేనపల్లి లక్ష్మయ్య వైయస్‌ఆర్‌సీపీలో చేరారు.

టీడీపీ మైనారిటీ నేత సాధిక్‌ బాషా, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమణ, తదితరులు చేరారు. ఇవాళ ఉదయం పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, సినీ నటుడు రాజారవీంద్ర, మాజీ మేయర్‌రత్నబిందు వైయస్‌ జగన్‌సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం టీడీపీ ఎంపీ తోట నరసింహులు, ఆయన సతీమణి తోట వాణి తదితరులు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు.
 

Back to Top