నిజ నిర్ధార‌ణ క‌మిటీని అడ్డుకున్న పోలీసులు..

పోలీసులు, వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌కు మ‌ధ్య వాగ్వాదం..

గుంటూరు: బీసీ రైతు కోటయ్య మృతిపై వైయస్‌ఆర్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, వైయస్‌ఆర్‌సీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.కోటయ్య మరణంపై వాస్తవాలు తెలుసుకునేందుకు  వైయస్‌ఆర్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ నేడు గుంటూరు జిల్లా కొండవీడుకు బ‌య‌లుదేరింది.  వైఎస్సార్‌ సీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించిన పోలీసులు.. పుట్టకోట చుట్టు నాలుగు చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు.

ఇద్దరు డీఎస్పీలు సహా 200 మంది పోలీసులు అక్కడ పహారా కాస్తున్నారు. అంతేకాకుండా చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీ చేపడుతున్నారు. ప్రజలను భయానికి గురిచేసేలా బాడీవామ్‌ కెమెరాలతో వీడియోలు తీస్తున్నారు.

పోలీసులు అడ్డుకోవ‌డం ప‌ట్ల క‌మిటీ స‌భ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

సీనియర్‌ నేత ఉమారెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ నిజ నిర్ధాకమిటీ వేశారు.కమిటీ సభ్యులుగా గుంటూరు జిల్లాకు చెందిన ఐదుగురు శాసన సభ్యులు (ముస్తఫా,  గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి,  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,  ఆళ్ల రామకృష్ణారెడ్డి)లతోపాటు పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యన్నారాయణ, పార్థసారథి, కొడాలి నాని, మర్రి రాజశేఖర్, రజని,  కృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి, మోపిదేవి వెంకటరమణ,  లేళ్ల అప్పిరెడ్డి,  గాంధీ,  మేరుగ నాగార్జున ఉన్నారు. 

Back to Top