ఎన్‌ఐఏ దర్యాప్తుతోనే వాస్తవాలు బహిర్గతం..

చంద్రబాబు,డీజీపీ సహకారంతోనే వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం..

పశ్చిమగోదావరిః చంద్రబాబు ఒక్క హామీని నెరవేర్చలేదని వైయస్‌ఆర్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.అన్నివర్గాలను చంద్రబాబు మోసం చేశారన్నారు.వైయస్‌ జగన్‌ నవరత్నాల ద్వారా మళ్లీ వైయస్‌ఆర్‌ పాలన వస్తుందన్నారు.బూత్‌ కమిటీ సభ్యులు నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.ప్రత్యేకహోదా అంశంలో ఐదు కోట్ల ప్రజలను చంద్రబాబు వంచించారన్నారు.చంద్రబాబు,డీజీపీ సహకారంతోనే జగన్‌పై హత్యాయత్నం జరిగిందన్నారు.హత్యాయత్నం ఘటన కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారన్నారు.ఎన్‌ఐఏ దర్యాప్తులో వాస్తవాలు బయటకొస్తాయన్నారు.బూత్‌ కమిటీ సభ్యులు సైనికులుగా పనిచేసి వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలన్నారు.

Back to Top