తాడేపల్లి: రాష్ట్రంలో ఇసుక కొత్త పాలసీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇవాళ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్హులు జారీ చేసింది. ఇటీవల కేబినెట్ భేటీలో కొత్త ఇసుక పాలసీకి ఆమోద ముద్ర వేసిన విషయం విధితమే. రాష్ట్రంలోని ఇసుక రీచ్లును మూడు ప్యాకేజీలుగా విభజిస్తూ ఉత్తర్హులు ఇచ్చింది. ప్యాకేజీ-1 పరిధిలో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో సహా తూర్పు గోదావరి జిల్లా, ప్యాకేజీ -3 పరిధిలో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు, ప్యాకేజీ -3 పరిధిలో నెల్లూరు జిల్లా సహా రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఉన్నాయి. ప్యాకేజీల వారీగా ఇసుక రీచ్‌లను కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలని ఉత్తర్హులు జారీ చేశారు. కేంద్ర సంస్థలు ముందుకు రాకుంటే ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. బిడ్డింగ్ ద్వారా మూడు ప్యాకేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని సూచన. టెక్నికల్, కమర్షియల్ బిడ్ల ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశం. వాల్టా చట్టానికి లోబడి ఇసుక తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వం సృష్టీకరణ. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు నిషేధిస్తూ ఉత్తర్హులు