పేద‌ల సొంతింటి క‌ల సాకారంలో భాగ‌స్వాముల‌వ్వండి

జేసీల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

తాడేప‌ల్లి: నిరుపేద‌ల సొంతింటి క‌ల‌ను నిజం చేయాల‌నే ప్ర‌భుత్వ ఆశ‌య సాధ‌న‌లో భాగ‌స్వాములు కావాల‌ని నూత‌న‌ జాయింట్ క‌లెక్ట‌ర్ల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సూచించారు. పేదలందరికీ ఇళ్లు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లాల్లో ప్రత్యేకంగా నియమించిన జేసీలతో తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా, ఉన్న‌తాధికారుల సూచ‌న‌ల మేర‌కు ప్ర‌జా సేవే ధ్యేయంగా ప‌నిచేయాల‌ని సూచించారు. పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం స‌మ‌ర్థ‌వంతంగా అమ‌ల‌య్యేందుకు ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌ని ఆదేశించారు. ప‌లు అంశాల‌పై జేసీల‌కు దిశానిర్దేశం చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top