కొత్త జిల్లాకు అల్లూరి పేరు పెడతాం

ఏపీని అక్షరాస్య‌త‌లో నెంబ‌ర్ వ‌న్‌గా చేస్తాం

ప‌ర్యాట‌క శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

 విశాఖపట్నం : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని సీతమ్మధారలోని ఆయన విగ్రహానికి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ పూలమాల వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా మన్యం వీరుడి గొప్పతనాన్ని మంత్రి గుర్తుచేశారు. విశాఖలో ఏర్పడే కొత్త జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని మంత్రి పునరుద్ఘాటించారు. అందరూ అల్లూరి స్పూర్తిగా స్వార్థ రహిత జీవితం గడపాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో బెల్ట్‌షాపులు ఎత్తివేయాలని గొప్ప నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

అమ్మఒడి పథకంతో ఆంధ్రప్రదేశ్‌ త్వరలోనే అక్షరాస్యతలో నంబర్‌ వన్‌గా మారనుందని ధీమా వ్యక్తం చేశారు.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో అల్లూరి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో యలమంచిలి ఎమ్మెల్యేలు కన్నబాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు చొక్కాకుల వెంకటరావు, సత్తిరామకృష్ణారెడ్డి, ప్రేమ్‌బాబు, బాకిం శ్యామ్‌కుమార్‌రెడ్డిలు పాల్గొన్నారు. 

Back to Top