రాపూరులో నేదురుమ‌ల్లి రామ్‌కుమార్‌రెడ్డికి ఘ‌న స్వాగ‌తం

నెల్లూరు:  వెంక‌ట‌గిరి వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌యక‌ర్త‌గా నియ‌మితులైన నేదురుమ‌ల్లి రామ్‌కుమార్‌రెడ్డికి రాపూరులో  ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి, పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఆమంచి కృష్ణమోహన్‌ను నియమించారు. వైయ‌స్ జ‌గ‌న్ నిర్ణ‌యం ప‌ట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ సంబ‌రాలు చేసుకున్నారు. రాపూరుకు వ‌చ్చిన రామ్‌కుమార్‌రెడ్డికి ఘ‌న స్వాగ‌తం ప‌లికి, దుశ్శాలువాలు, పూల‌మాల‌ల‌తో స‌త్క‌రించారు. వైయ‌స్ జ‌గ‌న్ నాయ‌క‌త్వం వ‌ర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాల‌తో హోరెత్తించారు. అంద‌రం స‌మ‌ష్టిగా ప‌ని చేసి మ‌రోమారు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువ‌ద్దామ‌ని రామ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. త‌న‌ను స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు రామ్‌కుమార్‌రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  

Back to Top