కడప పార్లమెంటు వాసుల ఆత్మీయ సమావేశం.

హైదరాబాద్‌: నాలుగున్న‌రేళ్లు  ప్రజల‌ను మోసం చేసిన చందబ్రాబు..మళ్లీ  ఎన్నిక‌ల‌ సమయంలో మభ్యపెట్టి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోడానికి చంద్రబాబు కుటిల  ప్రయత్నాలు చేస్తున్నాడ‌ని, ఈ సమయంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాని వైయస్‌ఆర్‌సీపీ నేత‌లు  పిలుపునిచ్చారు. కూకట్‌పల్లిలో కడప పార్లమెంటు వాసు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.నగరంలో స్థిరపడిన కడప,పులివెందు,మైదుకూరు,కమలాపురం,జమ్మమడుగు,ప్రొద్దుటూరు,బద్వేల్‌ నియోజకవర్గాల ప్ర‌జ‌లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా  సజ్జల‌  రామకృష్ణారెడ్డి,మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి, కడప మేయర్‌ సురేష్‌బాబు, వైయస్‌ఆర్‌సీపీ  ఎమ్మెల్యే  ర‌ఘురామిరెడ్డి,రవీంద్రనాధ్‌రెడ్డి, శివప్రసాద్‌ రెడ్డి, అంజాద్‌ బాషా,ఎమ్మెల్సీ గోవిందరెడ్డి,కోఆర్డినేటర్లు సుధీర్‌రెడ్డి, వెంకట సుబ్బయ్య, మల్లికార్జున రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, మధుసూదన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top