సీఎం వైయస్‌ జగన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

 న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సీఎం వైయస్‌ జగన్‌కు విషెష్‌ చెబుతూ శనివారం ఈ మేరకు ట్వీట్‌ చేశారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ట్విటర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆయన కోరుకున్నారు.

 

Back to Top