వైయ‌స్ఆర్‌సీపీ లోక్‌సభాపక్ష ఉపనేతగా నందిగం సురేష్‌

పార్లమెంటరీ పార్టీ కోశాధికారిగా లావు శ్రీకృష్ణదేవరాయలు

న్యూఢిల్లీ:  వైయ‌స్ఆర్‌సీపీ లోక్‌సభాపక్ష ఉపనేతగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ కోశాధికారిగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియమితులయ్యారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి ఈ నియామకాలు చేసినట్టు పార్టీ కార్యాలయ కార్యదర్శి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top