లోకేష్‌..మీ బాబు రూట్లో వెళ్తే నీకు అదే గ‌తి త‌ప్ప‌దు

వైయస్ఆర్ కాంగ్రెస్  పార్టీ ఎంపీ నందిగం సురేష్   

 ఎస్సీలను వేధింపులకు గురిచేయడం అన్నది బాబుగారి పేటెంట్‌. 

 లోకేష్‌ను అరెస్టు చేయకపోతే తప్పు అవుతుంది తప్ప, అరెస్టు చేయడం ఏమాత్రం తప్పుకాదు. 

శవాల్ని పీక్కుతినే రాబందులకంటే ముందే వాలిపోతున్న లోకేష్
 
 పరామర్శించడానికి వచ్చి వైయస్ఆర్సీపీ దళిత కార్యకర్తల్ని కొడుకులని తిట్టడమా..?

 బూతులు తిట్టినంతమాత్రాన నాయకుడివి కాలేవు లోకేష్.. 
 
ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ ఊరుకోరు 

 తాడేప‌ల్లి:  టీడీపీ నేత నారా లోకేష్‌  శవాలను పీక్కుతిసే రాంబందు కంటే ఘోరంగా తయారయ్యాడ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగాం  సురేష్ మండిప‌డ్డారు. నాయకుడు అవ్వాలంటే కష్టపడాలి. మీ నాయన రూట్‌లో వెళితే ఆయనకు పట్టిన గతే నీకూ పడుతుంద‌ని, కాబట్టి లోకేష్‌  నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా మంచిద‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. ఇవాళ గుంటూరులో నారా లోకేష్ వ్య‌వ‌హ‌రించిన తీరును నందిగాం సురేష్  తీవ్రంగా ఖండించారు. బిడ్డ చనిపోయి కుటుంబం దుఃఖంలో ఉంటే.. ఆ బంధువులు అందరూ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు తమకు న్యాయం చేస్తారని.. లోకేష్‌ రానవసరం లేదని చెప్పినా వినిపించుకోకుండా ఈ శవ రాజకీయం ఏంటి..అని ప్ర‌శ్నించారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

గుంటూరులో రమ్య అనే విద్యార్థినిని అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. ఎంత దారుణం అంటే మాటల్లో చెప్పుకోలేనంత బాధ. బిడ్డ చనిపోయి ఆమె తల్లిదండ్రులు, బంధువులు బాధ పడుతుంటే... పరామర్శ పేరుతో ప్రతిపక్ష టీడీపీ నాయకుడి కుమారుడు నారా లోకేష్‌ వెళ్లి అక్కడ మాట్లాడిన మాటలు చూస్తేంటే బాధ అనిపిస్తోంది. రమ్య హత్యను ఎందుకు పండుగ చేసుకుంటున్నారు?. హైదరాబాద్‌లో ఉండే లోకేష్‌కు ఇది ఒక రాజకీయ అవకాశంగా మాత్రమే కనిపిస్తోంది. మానవతా అంశంగా కనిపించడంలేదు. 

పరామర్శకు వచ్చిన సందర్భంలోనూ.. లోకేష్‌ కు  లోలోపల ఏదో తెలియని ఆనందం, సంతోషం కనిపిస్తోంది. ఆడబిడ్డ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించి, వారికి సానూభుతి తెలిపి, ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా  ఏమైనా చేయాలని ప్రభుత్వానికి సూచన చేసిఉంటే బాగుండేది. కానీ ఎక్కడైనా డెడ్‌బాడీ ఉంటే అక్కడకు రాబందులకన్నా ముందే లోకేష్‌ వాలతాడని ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. బిడ్డ చనిపోయి కుటుంబం దుఃఖంలో ఉంటే.. ఆ బంధువులు అందరూ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు తమకు న్యాయం చేస్తారని.. లోకేష్‌ రానవసరం లేదని చెప్పినా వినిపించుకోకుండా ఈ శవ రాజకీయం ఏంటి..?
అక్కడ లోకేష్‌ మాట్లాడిన మాటలు చూస్తే..  వైయ‌స్ఆర్‌ సీపీ నా కొడుకులు, సాక్షి వాడు వచ్చాడా? అని మాట్లాడాడు. నోటికొచ్చిన బూతులు తిడితే హీరో అయిపోవు లోకేష్..? - ఉన్నపళంగా నాయకుడిని అయిపోవాలన్న లోకేష్ తపన, ఆరాటం, ఆయన చేస్తున్న పనులు చూస్తుంటే.. బరువు తగ్గడంతో పాటు బుర్ర కూడా తగ్గింది అని అర్థమవుతుంది. 

 ఎస్సీలను వేధింపులకు గురిచేయడం అనే విషయం చంద్రబాబుగారి పేటెంట్‌. అలాంటి నేరాలమీద పూర్తి హక్కులు చంద్రబాబే. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మహిళలపై ఎటువంటి దాడులు జరిగాయి..? టీడీపీ నేతలే పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసినప్పుడు వీళ్లు ఏంచేశారు? చుండూరు, కారంచేడు ఘటనలకు కారకులు ఎవరు..? ఇవన్నీ తెలుసుకుని లోకేష్ మాట్లాడాలి. 
 ఇది ప్రభుత్వం తోడ్పాటు వల్ల జరిగినది కాదు. ఒక చుండూరు లాంటిదో, ఒక కారంచేడు లాంటిదో, ఒక గరగపర్రులాంటిదో కానేకాదు.
 ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన అంశంలో.... ఆపాప తన కుటుంబ సభ్యులకు కాని, తన బంధువులకుగాని, తన మిత్రులకు గాని, పోలీసులకు గాని, అమ్మానాన్నలకు గాని తెలియజేయకపోవడంతో ఇంత దారుణం జరుగుతుందని ఊహించ లేకపోయారు. 
 ముందుగానే ఏమాత్రం సమాచారం ఉన్నా నివారించే వీలు ఉండేది. ప్రతి ఒక్క ఆడపిల్లకూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. 
 మీరేదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే దయచేసి సంకోచించవద్దు. మీ అండగా పోలీసులు ఉన్నారు, దిశ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి, మహిళా పోలీసులు ఉన్నారు. టోల్‌ఫ్రీ నంబర్లు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలుకూడా మీకు అండగా నిలబడతారు. 

 ఘటన జరిగిన తర్వాత పోలీసులు, ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించాలో అంత వేగంగా స్పందించాయి. నిమిషాల వ్యవధిలోనే నిందితుడ్ని గుర్తించి, అరెస్టుచేశాయి. బాధిత కుటుంబానికి అండగా ఉండేందుకు పరిహారం ప్రకటించడంతోపాటు, కొన్ని చర్యలు కూడా తీసుకున్నాయి. హోంమంత్రి వెళ్లి వారికి అండగా నిలిచారు. పోలీసు అధికారులు కూడా వారిని పరామర్శించారు. 
 ఒక ఇద్దరు వ్యక్తుల వల్ల ఈ ఘటన జరిగింది. ఆ దుర్మార్గుడు విద్యార్థినిని దారుణంగా చంపాడు. హంతకుడిని శిక్షించే విషయంలో ప్రభుత్వం కానీ, పోలీసు వ్యవస్థ కానీ ఎక్కడా రాజీపడదు. ఏ ఆడబిడ్డకు కష్టం వచ్చినా, జగన్‌ మోహన్‌ రెడ్డి గారూ సహించరు, ఈ ఘటనపై చాలా సీరియస్ గా ఉన్నారు. కానీ చనిపోయిన రమ్య... ఆ దుర్మార్గుడి వల్ల ఇబ్బందులు ఉన్నాయని, తల్లిదండ్రులకో, దిశా యాప్‌ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేది. ఇవాళ ఆ యువతిని ప్రాణాలతో కాపాడుకోగలిగేవాళ్లం. 

 బుర్రతక్కువ వ్యక్తిలా లోకేష్ మాట్లాడుతున్నాడు. లోకేష్‌ అనే వ్యక్తి రాజకీయంగా పరమ శుంఠ. శుంఠల్లో కూడా పరమశుంఠ. ఇలాంటి వ్యక్తి జగన్‌గారి ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ లేదని, నోటికొచ్చినట్లు మాట్లాడటం హాస్యాస్పదం.

 ఒకసారి మీ నాన్న చంద్రబాబును అడిగితే దళితుల గురించి ఏం మాట్లాడాడో తెలుస్తుంది. మీ నాయన హయాంలో దళితులపై జరిగిన దారుణాలు అన్నీఇన్నీ కావు. మీ నాన్నే చెప్పేవాడు ‘దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా.. దళితులు శుభ్రంగా ఉండరు. మురికిగా ఉంటారు. దళితులకు రాజకీయాలు ఎందుకు కొడుకుల్లారా..  అని నేనే మాట్లాడించాను’ అని మీ నాయనే చెబుతాడు. ఇలాంటివి అన్ని బయటకు వస్తాయి.
 చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీల హత్యలు ఎలా ఉన్నాయో చూస్తే.. ఆయన దిగిపోయిన సంవత్సరంలోనే 62 మంది ఎస్సీ, ఎస్టీలు హత్యకు గురైతే.. 
 ఈ రెండేళ్ల, 2 నెలల కాలంలో యాభైశాతం తగ్గుదల కనిపిస్తోంది. 
 ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలను చూస్తే 2018లో 91, 2019లో 82 కేసులు నమోదు అయితే, వైయస్సార్‌ సీపీ అధికాకంలోకి వచ్చిన తర్వాత నిరుడు 80, ఈఏడాది 63 కేసులు నమోదు అయ్యాయి. ఏడాదిలోనే తగ్గుదల కనిపించింది. 
 ఇక దర్యాప్తు చేసి చట్టంముందు నిలబెట్టేందుకు చంద్రబాబు హయాంలో 232 నుంచి 268 రోజులు వరకూ ప్రతికేసులోనూ సమయం పడితే, కాని జగన్‌గారి ప్రభుత్వంలో 2020లో సగటున 98 రోజులు పడితే, 2021 లో 59 రోజులకు తగ్గించగలిగాం 
 అనంతపురం, విజయవాడ, గుంటూరు సీతానగరం ఘటనలు, నిన్నటి గుంటూరు ఘటన... ఇలా జరిగిన నాలుగు కేసుల్లో కూడా 24 గంటల్లోపే ప్రభుత్వం ఆ కుటుంబాలకు అండగా నిలిచింది. వారికి పరిహారం కూడా ఇచ్చింది.

 ఓ పక్క ఆడ బిడ్డ చనిపోతే... నారా లోకేష్‌ ప్రెస్‌మీట్‌ పెట్టేముందు నవ్విన వెకిలి నవ్వును అందరూ గమనించేఉంటారు. పాప చనిపోతే రవ్వంత బాధలేకపోగా.... ఆనందపడుతూ వెకిలినవ్వులు నవ్వుతూ ప్రెస్‌మీట్‌లు పెట్టడమా?
 ఇవాళ ఏదైనా సంఘటన జరిగేనాటికి హైదరాబాద్‌ నుంచి పరిగెత్తుకు వచ్చి సాధించింది ఏంటి? నోటికొచ్చినట్లు మాట్లాడి, పోలీసులపై దౌర్జన్యం చేసి,  అరెస్ట్‌ అయితే హీరోలు అయిపోదామనుకుంటున్నావేమో. నువ్వు చేసిన పనిలో నీతి ఉంటే హీరోవు అవుతావే కానీ, అడ్డదారిలో హీరో అవుదామనుకుంటే హీరో కాదు... జీరోనే అవుతావు. నువ్వు పప్పు అని లోకమంతా కోడై కూస్తోంది.

  రమ్య శవాన్ని హైజాక్‌ చేయాలని, ఆ శవంతో రాజకీయం చేయాలని ప్రయత్నించిన నాయకులను గాని, లోకేష్‌ను గాని అరెస్టు చేయకపోతే అది తప్పు అవుతుంది తప్ప, అరెస్టు చేయడం ఏమాత్రం తప్పుకాదు. 
- పరామర్శకు వెళ్లిన టీడీపీ నేతలు పోలీసులపై ఎదురుదాడికి దిగారు. బూతులు తిడుతూ పోలీసులపై తిరగబడ్డారు. పైపెచ్చు పోలీసులు దౌర్జన్యం చేశారంటూ మాట్లాడుతున్నారు. టీడీపీ హయాంలో పోలీసులను అడ్డుపెట్టుకుని ఏం చేశారో అందరికీ తెలుసు. లోకేష్‌ నీతి కథలు చెప్పడమా? ఇలాంటి బుర్ర తక్కువవాళ్లు రోడ్లు మీదకు వచ్చి మాట్లాడటమా? దళితులుగా ఎవరూ పుట్టాలనుకోరని చంద్రబాబు  అంటే, ఇవాళ గుంటూరు వచ్చి, దళిత కార్యకర్తలను పట్టుకుని వైసీపీ నా కొడుకులు అని మాట్లాడతావా?
 అదే వైఎస్ఆర్సీపీ నాయకులు నిన్ను పట్టుకుని అరే లోకేష్‌, టీడీపీ నా.... అంటే నీకెలా ఉంటుంది? అలాంటిది దళితుల్ని నా కొడుకులు అని మాట్లాడుతున్నావంటే నిన్ను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. దళితులంటే లోకేష్‌ కి చాలా చిన్నచూపు. దళితులపట్ల లోకేష్‌ ఎక్కడ అసభ్య పదజాలం వాడినా మర్యాదగా ఉండదు. తగిన శాస్తి జరుగుతుంది.
- మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రిగారు దళితులను తన కుటుంబ సభ్యులుగా చూశారు తప్ప ఏ రోజుకూడా చిన్నచూపు లేదు. ఎస్సీలకు తెలివికూడా లేదని చంద్రాబు కుప్పంలోనే వ్యాఖ్యానించారు. 

 మీ నాయన దోచేసిన సొమ్ముతో ఎమ్మెల్సీ అయ్యి, అడ్డదారిన మినిస్టర్‌ అయ్యావు. నువ్వు ఏ శాఖకు మినిస్టరో కూడా చెప్పలేవు. అలాంటి నువ్వు ఓ ఆడపిల్ల చనిపోతే శవ రాజకీయాలు చేస్తావా?  మీ హయాంలో ఆడపిల్లలకు ఏమైనా సాయం చేసిన దాఖలాలు ఉన్నాయా? ఇలానే నోరు పారేసుకుంటే.. 2019లో మీకు 23 సీట్లు వస్తే, వచ్చే ఎన్నికల్లో మూడు కూడా వచ్చే పరిస్థితి ఉండదనేది గుర్తు పెట్టుకోవాలి. 

లోకేష్‌ కు ఒకటి, రెండు భాషలు వచ్చేమో... అదే మేము పచ్చి తెలుగులో మాట్లాడితే నువ్వు చెవులు, నోరు అన్నీ మూసుకుని పారపోవాల్సి వస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. కానీ వెటకారపు నవ్వులు, అడ్డగోలు మాటలతో లోకేష్ విన్యాసాలు చేశారు. శవాలను పీక్కుతిసే రాంబందు కంటే ఘోరంగా తయారయ్యాడు. నాయకుడు అవ్వాలంటే కష్టపడాలి. మీ నాయన రూట్‌లో వెళితే ఆయనకు పట్టిన గతే నీకూ పడుతుంది. కాబట్టి లోకేష్‌  నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా మంచిది. 

  మా ప్రభుత్వం బాధితుల ప్రాణాలకు వెలకట్టడంలేదు. కాని, బాధితుల వైద్యావసరాల దృష్ట్యా, లేకపోతే వారి కుటుంబ సభ్యులు అవసరాల దృష్ట్యా ఈ కుటుంబాలకు చిల్లిగవ్వ చేతిలో లేకపోతే అసలే కష్టాల్లో ఉన్నవారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టే, వారికి అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది.
 సరమ్య హత్యపై ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్‌గా ఉన్నారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీసులను ఆదేశించారు.  జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరిస్తారు. తప్పు జరిగితే ఎలాంటి వ్యక్తులనైనా శిక్షించడం జరుగుతుంద‌ని నందిగాం సురేష్ స్ప‌ష్టం చేశారు. 

Back to Top