గుణ్ణం నాగబాబు వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌

కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు జనసేన నేత గుణ్ణం నాగబాబు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నాగబాబుతో పాటు పార్టీలో చేరిన ఆయన తనయుడు గుణ్ణం సుభాష్, పాలకొల్లు జనసేన నేతలు వీర శ్రీనివాసరావు, విప్పర్తి ప్రభాకరరావుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, జెడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్ ఉన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top