సీఎం జగన్‌ను కలిసిన ‘నాటా’ బృందం

అమ‌రావ‌తిః ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) బృందం కలిసింది. అసెంబ్లీలోని కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి వచ్చే ఏడాది జూన్‌లో న్యూజెర్సీలో జరిగే ‘నాటా’ మహాసభలకు రావాలని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు నాటా సభ్యులు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో నాటా కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి, జాయింట్‌ ట్రెజరర్‌ మేకా శివ, ఇంటర్నేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కిష్టపాటి రమణారెడ్డి, నాటా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ సాగంరెడ్డి అంజిరెడ్డి, ఇండియా కో–ఆర్డినేటర్‌ మల్లు ప్రసాదరెడ్డి ఉన్నారు.

తాజా ఫోటోలు

Back to Top