సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్‌ అవుతున్న పీడీఎఫ్ న‌కిలీ

ఎమెస్కో పబ్లిషర్స్‌ అచ్చువేసిన నాలో..నాతో వైయ‌స్ఆర్ పుస్త‌కం అస‌లైన‌ది

టీటీడీ చైర్మ‌న్‌ వైవీ సుబ్బారెడ్డి

తాడేప‌ల్లి: ‘‘నాలో..నాతో..వైయ‌స్సార్‌’’ పుస్తకం పేరుతో పీడీఎఫ్‌ ఫైల్‌ను సామాజిక మాధ్యమాల్లో సర్క్యూలేట్ చేస్తున్నార‌ని, అది న‌కిలీద‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సోష‌ల్ మీడియాలో న‌కిలీ పీడీఎఫ్ స‌ర్య్కూలెట్ చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. వైయ‌స్ఆర్‌సీపీ గౌర‌వాధ్య‌క్షురాలు  వైయ‌స్ విజయమ్మ రాసిన పుస్తకానికి, దీనికి సంబంధం లేదని  తెలిపారు. ఎమెస్కో పబ్లిషర్స్‌ అచ్చువేసిన పుస్తకమే అసలైన పుస్తకమని ఆయన స్పష్టం చేశారు. ‘‘సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్‌ అవుతున్న పీడీఎఫ్‌ ఫైల్‌లోని అంశాలు వేర్వేరుగా ఉన్నాయి. దురుద్దేశంతో ఈ పీడీఎఫ్‌ఫైల్‌ను సర్క్యులేట్‌చేస్తున్నారు. దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశామని, వైయ‌స్సార్‌ అభిమానులు కూడా ఈ అంశాన్ని గమనించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు.
 

Back to Top