దేవినేని వెకిలితనానికి నిదర్శనం అతని ప్రవర్తన

కపట నాటక సూత్రధారి దేవినేని ఉమా

జాతీయ నేతల విగ్రహాలు నెలకొల్పడం అదృష్టం.

 మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు 

ఎన్టీఆర్ జిల్లా : మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రవర్తన అతని వెకిలితనానికి నిదర్శనమని మైలవరం శాసనసభ్యులు  వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. దేవినేని ఉమా కపట నాటక సూత్రధారి అని విమర్శించారు. జాతీయ నేతలను గౌరవించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు  మన జాతి సంపద అని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం శక్తి నగర్ లో జాతీయ నేతల విగ్రహాలను కొందరు స్వల్పంగా ధ్వంసం చేసి, నష్టం కలిగించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ సోమవారం శక్తి నగర్లో  వారి ఇరువురు విగ్రహాలకు క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.   అనంతరం ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. 

గత ప్రభుత్వంలో ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయమని అప్పటి శాసనసభ్యుడిని అడిగితే చీత్కరించుకున్నాడు. జాతి ఉజ్వల భవితకు నాంది పలికిన మహనీయుల విగ్రహాలను నెలకొల్పే అదృష్టాన్ని తనకు ఇచ్చిన ఈ ప్రాంత నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలతో తను ఖర్చుపెట్టే సొమ్ముకు సార్థకత చేకూరుతుందన్నారు.

ఈ విగ్రహాలు ఇక్కడ నెలకొల్పిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మాజీ మంత్రి దేవినేని ఉమా... వారి జయంతులకు కానీ, వర్ధంతులకు కానీ, కనీసం ఒక్క దండ కానీ, ఒక్క పూలమాల కానీ వేయలేదు. ఇవన్నీ వదిలేసి స్టిక్ పెట్టడానికి వాడెవడు, వీడెవడు అంటూ మాట్లాడుతున్నాడు దేవినేని ఉమా..ఇదేనా నీ సంస్కారం.?, ఇదేనా నీ భాష?.
డెవర్షన్ పాలిటిక్సా..? అసలు నువ్వు అనేదానికి ఏమైనా అర్ధముందా? చేసేది నువ్వు... చేయించేది నువ్వు. ఇక్కడ జరిగిన ఘటనను ఎక్కడో జరిగిన హత్యకు ముడి పెట్టావంటే అసలు నువ్వు ఏ జాతికి చెందిన వాడివి?
దేవినేని ఉమామహేశ్వరరావు అటు ప్రజల్లో, ఇటు వాళ్ళ నాయకుల్లో పలుచనై అతీ, గతీ లేక జీవన్మృతుడిగా బతుకుతున్న దేవినేని ఉమాకు డైవర్షన్ పాలిటిక్స్ అవసరం. అందుకే దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చూశాడు.
అసలు నువ్వు ఎవడివి దీని గురించి మాట్లాడటానికి దేవినేని ఉమా?, జరిగిన ఘటనకు బాధపడిన మా వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు, మహనీయుల విగ్రహాల వద్ద కొత్త స్టిక్, కళ్లజోడు మళ్లీ వెంటనే అమర్చారు.  దీనిపై అనవసరంగా ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నావు. దోషులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తే తప్పులేదు. గతంలో కూడా ఇలానే ప్రతి అంశాన్ని రాజకీయంతో ముడిపెట్టి ఉనికి కోసం పాకులాడిన చరిత్ర నీది దేవినేని అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Back to Top