వక్క తోట‌ల‌ను ప‌రిశీలించిన  ఎంవీఎస్ నాగిరెడ్డి

 
ప‌శ్చిమ గోదావ‌రి:  జిల్లాలో సాగ‌వుతున్న వ‌క్క తోట‌ల‌ను అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మ‌న్ ఎంవీఎస్ నాగిరెడ్డి గురువారం ప‌రిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్  బూరుగుపల్లి సుబ్బా రావు,హార్టి కల్చర్ శాఖ అధికారులతో  కలిసి నాగిరెడ్డి వక్క తోటను సంద‌ర్శించారు.  పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం, కవ్వగుంట లో  విజయ సారథి  వక్క తోటను ప‌రిశీలించి వివ‌రాలు అడిగి తెలుసున్నారు.  వక్క ప్రధాన పంటగా... 40 ఎక‌రాల విస్తీర్ణంలో కొబ్బరి, మిరియాలు, వెనీలా, తేనె టీగల పెంపకం, మినీ డైరీ నిర్వ‌హిస్తున్న‌ట్లు రైతు చెప్పారు. కర్ణాటక, కేరళ, అస్సాం లలో ప్రధానంగా అలానే మేఘాలయ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లలో లాభ సాటిగా ఉన్న వక్క తోట పెంపకం అంధ్ర ప్రదేశ్ లో చేపట్టి 25 సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తున్న విజ‌య సార‌ధి.. వ‌క్క పంట‌ను లాభ సాటిగా చెయ్య వఛ్హని నిరూపించార‌ని నాగిరెడ్డి అభినందించారు.  అలాగే పశ్చిమ గోదావరి జిల్లా లో వక్క తోటల రైతుల కృషిని అభినందించారు. 

Back to Top