రైతు సంఘాల ఆందోళ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ సంఘీభావం

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి

విజ‌య‌వాడ‌: దేశవ్యాప్తంగా రైతు సంఘాల పిలుపు మేరకు సంయుక్త కిసాన్ మోర్చా ఈరోజు నిర్వహిస్తున్న ఆందోళనలకు రైతు పక్షపాత పార్టీగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సంఘీభావం ప్రకటించిన‌ట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. అంతేకాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్వచ్ఛందంగా ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేయడం జరిగింద‌ని తెలిపారు. గతంలో కూడా ఇదే మాదిరిగా, దేశవ్యాప్త రైతు సంఘాల ఆందోళనలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం ప్రకటించినట్లు ఎంవీఎస్ నాగిరెడ్డి గుర్తు చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top