గత ఖరీఫ్‌ కంటే 3.4 లక్షల టన్నులు అధికంగా సేకరించాం

రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి 
 

తాడేపల్లి: గత సంవత్సరం ఖరీఫ్‌ కంటే ఈ ఏడాదిలో ఇప్పటికే 3.4 లక్షల టన్నుల ధాన్యం అధికంగా సేకరించామని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి పేర్కొన్నారు. కృష్ణా, గుంటూర్ జిల్లాలలో మినుము పంట మూలంగా మాసూలు చెయ్య లేక పోయిన రైతుల ధాన్యం సుమారు 1.6 లక్షల టన్నులు ప్రస్తుతం సేకరణ జరిగిందన్నారు. మొత్తం 5 లక్షల టన్నులు అధికంగా సేకరించామని నాగిరెడ్డి తెలిపారు.                                

రబీలో 5.49 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
ఇక రబీ విషయం లో 2018-19 ఏప్రిల్ 29 నాటికి 3.31 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే..2019-20 ఏప్రిల్ 29 నాటికి కరోనాతో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో 5.49 లక్షల టన్నులు సేకరించామన్నారు. ఇప్పటి వరకూ మార్క్ ఫెడ్ ద్వారా సేకరించిన మొక్క జొన్నకు 14,222 టన్నులకు చెల్లింపునకు ప్రొసెస్ చేశామన్నారు. 8,919.1 టన్నులకు 1323 మంది రైతులకు రూ.15.7 కోట్లు చెల్లింపులు జరిగాయని చెప్పారు.  
ప్రతిపక్షాలు పని కట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుందని, రైతులు ఇలాంటి  దుష్ప్రచారాన్ని నమ్మొద్దని నాగిరెడ్డి సూచించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top