నీటి వాడకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అసత్య ప్రచారాలు

ఏపీ వ్యవసాయ మిషన్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి

గుంటూరు: నీటి వాడకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తుందని  ఏపీ వ్యవసాయ మిషన్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి  మండిపడ్డారు.  తెలంగాణ సర్కార్‌పై  ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  గుంటూరులో కృష్ణా జలాల వివాదంపై మంగళవారం చర్చా గోష్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన నాగిరెడ్డి మాట్లాడుతూ..45 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి ఉన్నాయి. ఉమ్మడిలో రాష్ట్రంలో మేం కూడా ఉన్నామని, వన్‌ థర్డ్‌ మాకు వస్తాయని అడగడంలో ధర్మం ఉందన్నారు. ఇది జరిగే ప్రక్రియ కాదు. ఏపీకి ఇంత అన్యాయం జరగడానికి కారణం చంద్రబాబే కారణమని ధ్వజమెత్తారు. తన 9 ఏళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా మొదలు పెట్టలేదని విమర్శించారు. ట్రిబ్యూనల్‌ జడ్జి మెంట్లో ఉన్నా కూడా..వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుంటున్నా ఆ రోజు చూస్తూ ఊరుకున్నారని తప్పుపట్టారు. బజావత్, బ్రిజేష్‌ కుమార్‌ ట్రì బ్యూనల్స్‌ ఆధారంగా కృష్ణా జలాలు పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, లక్ష్మణ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 
 

Back to Top