ఏపీ అభివృద్ధి వైయస్‌ జగన్‌తోనే సాధ్యం

జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం

వైయస్‌ఆర్‌సీపీ నేత తాడిశెట్టి మురళీ

హైదరాబాద్‌: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి అని వైయస్‌ఆర్‌సీపీలోకి చేరిన గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావ్‌ సోదరుడు తాడిశెట్టి మురళీ అన్నారు.హైదరాబాద్‌లో వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  బడుగు,బలహీన వర్గాల అభివృద్ధికి వైయస్‌ జగన్‌తోనే సాధ్యమవుతుందనే నమ్మకంతో పార్టీలోకి చేరినట్లు తెలిపారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని సీఎం చేసి ఆంధ్ర రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకుంటామని తెలిపారు.

Back to Top