కుప్పంలో చంద్ర‌బాబుకు షాక్‌

టీడీపీ శ్రేణులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక   
 

చిత్తూరు:  14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన చంద్ర‌బాబుకు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఆద‌ర‌ణ క‌రువైంది. ఆయ‌నపై న‌మ్మ‌కం లేక సొంత పార్టీ నేత‌లే ఛీద‌రించుకుంటున్నారు.  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌డుతున్న సంక్షేమ పాల‌న‌కు ఆక‌ర్శితులై టీడీపీకి చెందిన ప‌లువురు నేత‌లు, కార్య‌క‌ర్త‌లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు.  కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని నాల్గో వార్డు కమతమూరుకు చెందిన దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు ఆదివారం వైయ‌స్సార్‌సీపీలో చేరారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుల్లెట్‌ సురేష్, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి భరత్‌ ఆధ్వర్యంలో కమతమూరుతో పాటు కత్తిమానుపల్లి, గుండ్లపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వైయ‌స్సార్‌సీపీలో చేరారు. అలాగే కుప్పం మునిసిపాలిటీకి చెందిన టీడీపీ సీనియర్‌ నేత అడవి కొట్టాలు సుబ్రమణ్యం కూడా వైయ‌స్సార్‌సీపీలో చేరారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ అందిస్తున్న సంక్షేమ పాలన చూసి పార్టీలో చేరినట్టు వారు చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top