మొదట్నుంచీ చర్చలకు ప్రభుత్వమే సానుకూలంగా ఉంది

ఉద్యోగులకు చంద్రబాబు ఏం ఉద్దరించారు..?

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడ: ఉద్యోగులకు చంద్రబాబు ఏం ఉద్దరించారు..? చంద్రబాబు కంటే ఎక్కువగానే ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేశామని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మొదట్నుంచీ చర్చలకు ప్రభుత్వమే సానుకూలంగా ఉందని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. చర్చలకు మంత్రుల కమిటీ సిద్ధంగా ఉందని, పదే పదే ఆహ్వానించినా చర్చలకు రాకుండా ఆందోళనలు చేయడం సరికాదన్నారు. ఉద్యోగుల జీతాలు ప్రాసెస్‌ చేశాక, ఆపమని చెప్పడం భావ్యం కాదన్నారు. పీఆర్సీ అమలులో సమస్యలుంటే చర్చిస్తామన్నారు. 

ఉద్యోగుల ఆందోళనలపై ప్రభుత్వం సంయమనంగా వ్యవహరించిందన్నారు. కోవిడ్‌ జాగ్రత్తలు పాటించమని చెప్పామని చెప్పామని గుర్తుచేశారు. ఉద్యోగులతో పోలీసులు సంయమనంగానే వ్యవహరించారని బొత్స సత్యనారాయణ చెప్పారు. ఉద్యోగులు చర్చలకు వచ్చి ఉంటే సమస్యకు ఎప్పుడో పరిష్కారం వచ్చి ఉండేదన్నారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు.. ఏ సమస్య అయినా చర్చలతో పరిష్కరించుకోవచ్చన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top