సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ముద్ర‌గ‌డ ధ‌న్య‌వాదాలు

ముఖ్య‌మంత్రికి కాపు ఉద్య‌మ నేత బ‌హిరంగ లేఖ‌

తూర్పు గోదావ‌రి:  కాపుల‌పై ఉన్న కేసులు ఎత్తివేయ‌డం ప‌ట్ల ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆయ‌న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు బ‌హిరంగ లేఖ రాశారు.  కాపు ఉద్యమంలో పెట్టిన కేసులు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఇటీవ‌ల నిర్వ‌హించిన కేబినెట్ మీటింగులో ఉపసంహరించినట్లు తీర్మానం చేసిన‌ట్లు మంత్రి క‌న్న‌బాబు తెలిపార‌న్నారు. చెయ్యని నేరానికి మమ్ములను ముద్దాయిలను చేస్తూ పెట్టిన కేసులు చాలా అన్యాయమని,  కాపు జాతి త‌న‌ను ఉద్యమం నుండి తప్పించినా, భగవంతుడు మీ ద్వారా ఆ కేసులకు మోక్షం కలిగించార‌ని సంతోషం వ్య‌క్తం చేస్తూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top