వైయ‌స్ఆర్ సీపీలో చేరిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం

తాడేప‌ల్లి: కాపు ఉద్య‌మ నేత‌, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రిని వైయ‌స్ జ‌గ‌న్‌ను ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం, ఆయ‌న కుమారుడు గిరి వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వారికి వైయ‌స్ఆర్ సీపీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి జిల్లా వైయ‌స్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు), ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు

Back to Top