పరిషత్‌ ఎన్నికల్లో ఫ్యాన్‌ ప్ర‌భంజ‌నం

ఏక‌ప‌క్షంగా వెలుబ‌డుతున్న ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ఫ‌లితాలు

కుప్పంలో కుప్ప‌కూలిన టీడీపీ కోట 

రాష్ట్ర‌వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థుల విజ‌య‌దుందుబి

అమరావతి:  ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో ఫ్యాన్ పార్టీ ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది.  ఆదివారం వెలుబ‌డుతున్న ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏక‌ప‌క్షంగా సాగుతున్నాయి. ప్ర‌తిప‌క్ష పార్టీ ఎక్క‌డా పోటీ ఇవ్వ‌లేక‌పోతోంది.  7,219 ఎంపీటీసీ.. 515 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన ఏడాదిన్నర తర్వాత నేడు వారి భవితవ్యం తేలుతోంది. ఏప్రిల్‌ 8వ తేదీన ఆయా స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైకోర్టు తీర్పు కారణంగా ఐదున్నర నెలలుగా ప్రజా తీర్పు స్ట్రాంగ్‌ రూంలకే పరిమితం అయిన విషయం తెలిసిందే.  

మూడు రోజుల క్రితమే హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఓట్ల లెక్కింపునకు అనుమతించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 206 కేంద్రాల్లోని 209 ప్రదేశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక్కో కౌంటింగ్‌ కేంద్రంలో మండలాల వారీగా వేర్వేరుగా ఓట్ల లెక్కింపు కోసం వేర్వేరు హాళ్లను సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొన‌సాగుతోంది. 

ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇలా..

ప్రకాశం: మార్కాపురం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 15,315 మెజార్టీతో వైఎస్సార్‌సీ అభ్యర్థి బాపన్నరెడ్డి విజయం సాధించారు.
విశాఖపట్నం: 45 ఓట్ల మెజార్టీతో జీకే వీధి ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు
ప్రకాశం: తుర్లుపాడు జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 10,335 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్న ఇందిర గెలుపు పొందారు.
ప్రకాశం జిల్లాలో రెండు జడ్పీటీసీలు వైఎస్సార్‌సీపీ కైవసం
చిత్తూరు: ఎస్‌ఆర్‌పురం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 13,335 ఓట్ల మెజార్టీతో రమణ ప్రసాద్‌రెడ్డి గెలుపొందారు.
కర్నూలు: మహానంది జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం. 13,288 ఓట్ల మెజార్టీతో కేవీఆర్‌ మహేశ్వర్‌రెడ్డి గెలుపు

పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా
చిత్తూరు: పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. 1573 ఓట్ల మెజార్టీతో బుగ్గపట్నం ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు పొందారు. 1073 ఓట్ల మెజార్టీతో టీ.సదుం ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపొందారు.

విజయనగరం: 44 ఓట్ల మెజార్టీతో గంజాయి భద్ర ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు
అనంతపురం: 1331 ఓట్ల మెజార్టీతో వెన్న పూసపల్లి ఎంపీపీటీ(వైఎస్సార్‌సీపీ)  గెలుపు

కృష్ణా జిల్లా: 180 ఓట్ల మెజార్టీతో పాములంక ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు
కృష్ణా: 585 ఓట్ల మెజార్టీతో ఆటపాక ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు
విజయనగరం: 1629 ఓట్ల మెజార్టీతో ఉత్తరవల్లి ఎంపీటీసీ( వైఎస్సార్‌సీపీ) గెలుపు)
ప్రకాశం: 1645 ఓట్ల మెజార్టీతో సంతమాగులూరుఏ-1 ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు
ప్రకాశం: 434 ఓట్ల మెజార్టీతో ఊళ్లపాలెం ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు

మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌
గుంటూరు: మాచర్ల నియెజకవర్గంలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఐదు జీడ్పీటీసీ స్థానాలకు ఐదూ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 71 ఎంపీటీసీ స్థానాలకు 71 వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

బాబు ఇలాకాలో ఫ్యాన్‌ గాలి..
చిత్తూరు జిల్లా: చంద్రబాబు ఇలాకాలో ఫ్యాన్‌ గాలి వీచింది. కుప్పం మండలం టీ సద్దుమూరు ఎంపీటీసీ స్థానం  వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అశ్విని 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.

విజయనగరం: పరిషత్‌ ఎన్నికలల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. సీతానగరం మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలకు ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన 11 ఎంపీటీసీ స్థానాల్లో 5 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.
►పశ్చిమగోదావరి: 613 ఓట్ల మెజార్టీతో  శ్రీరామపురం ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు 
►వైఎస్సార్‌ జిల్లా: 490 ఓట్ల మెజార్టీతో ఎస్‌.కొత్తపల్లి ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ గెలుపు
►వైఎస్సార్‌ జిల్లా: 1682 ఓట్ల మెజార్టీతో పెద్దకారంపల్లి ఎంపీటీసీ (వైఎస్సార్‌సీపీ) గెలుపు
►వైఎస్సార్‌ జిల్లా: 490 ఓట్ల మెజార్టీతో ఎస్‌.కొత్తపల్లి ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ గెలుపు
►వైఎస్సార్‌ జిల్లా: 1682 ఓట్ల మెజార్టీతో పెద్దకారంపలల్లి ఎంపీటీసీ (వైఎస్సార్‌సీపీ) గెలుపు
►కృష్ణా: 372 ఓట్ల మెజార్టీతో అక్కపాలెం ఎంపీటీసీ (వైఎస్సార్‌సీపీ) గెలుపు
►చిత్తూరు: 616 ఓట్ల మెజార్టీతో పాత వెంకటాపురం ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు
►వైఎస్సార్‌ జిల్లా: 883 ఓట్ల మెజార్టీతో ఊటుకురు-2 ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు
►అనంతపురం: 882 ఓట్ల మెజార్టీతో దంచర్ల ఎంపీటీసీ( వైఎస్సార్‌సీపీ) గెలుపు
►అనంతపురం: 729 ఓట్ల మెజార్టీతో అమ్మలదిన్నె ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు
►చిత్తూరు: 1573 ఓట్ల మెజార్టీతో బుగ్గపట్నం ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు
►అనంతపురం: రామగిరి జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం
►వైఎస్సార్‌ జిల్లా: జమ్మలమడుగు జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం
►వైఎస్సార్‌ జిల్లా: బంటుపల్లి జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం
►పశ్చిమగోదావరి: జీలుగుమిల్లి జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం
►కృష్ణా: పెడన జడ్పీటీసీ పోస్టల్‌బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం
►పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
►నెల్లూరు: 766 ఓట్ల మెజార్టీతో ఆమంచర్ల ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు
►పశ్చిమగోదావరి: వేలేరుపాడు జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం

►నెల్లూరు: కలిగిరి జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం
వైఎస్సార్‌ జిల్లా: జమ్మలమడుగు జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం

►అనంతపురం: కనగాపల్లి జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మారుతి ప్రసాద్‌ ఆధిక్యం
ఉరవకొండ జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పార్వతమ్మ ఆధిక్యం
తనకల్లు జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జక్కల జ్యోతి ఆధిక్యం
పెద్దవడుగూరు జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భాస్కర్‌రెడ్డి ముందంజ
కంబదూరు జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం

►వైఎస్సార్‌ జిల్లా: కమలాపురం మండలం దేవరాజుపల్లి దేవరాజుపల్లి ఎంపీటీసీ (వైఎస్సార్‌సీపీ) గెలుపొందారు. 186 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి విజయం సాధించారు.

►విజయనగరం: జిల్లా వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 31 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 31 జడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను  జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు.

►పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం డివిజన్‌ పరిధిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతుంది. పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో ఉంది.
►ఆంధ్రప్రదేశ్‌ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్‌ నిర్వహిస్తున్నారు. 515 జడ్పీటీసీ, 7216 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌ జరుగుతోంది.

► 7,219 ఎంపీటీసీ.. 515 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన వారి భవితవ్యం తేలబోతోంది. హైకోర్టు తీర్పు కారణంగా ఐదున్నర నెలలుగా ప్రజా తీర్పు స్ట్రాంగ్‌ రూంలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 8వ తేదీన ఆయా స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

జిల్లాల వారీగా..
శ్రీకాకుళం:  37 జడ్పీటీసీ, 590 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌
విజయనగరం: 31 జడ్పీటీసీ,  487 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌
విశాఖపట్నం: 37 జడ్పీటీసీ,   612 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌
తూర్పు గోదావరి: 61 జడ్పీటీసీ, 996 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌
పశ్చిమ గోదావరి: 45 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌
కృష్ణా: 41 జడ్పీటీసీ, 648  ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌
గుంటూరు : 45 జడ్పీటీసీ,  571 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌
ప్రకాశం: 41 జడ్పీటీసీ, 368 ఎంపీటీసీ  స్థానాలకుకౌంటింగ్‌
నెల్లూరు: 34 జడ్పీటీసీ, 362 ఎంపీటీసీ  స్థానాలకుకౌంటింగ్‌
చిత్తూరు: 33 జడ్పీటీసీ, 419 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌
వైఎస్సార్‌: 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌
కర్నూలు: 36 జడ్పీటీసీ,  484 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌
అనంతపురం: 62 జడ్పీటీసీ, 781  ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌

ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్‌
పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. రాత్రి లోపు పూర్తిస్థాయి ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఐదారు చోట్ల బ్యాలెట్‌ బాక్సుల్లో నీళ్లు చేరాయని తెలిపారు. బ్యాలెట్‌ బాక్సులు పూర్తిగా తెరిచాక స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top