విశాఖ: ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏం జరిగినా వైయస్‌ఆర్‌సీపీకి అంటగడుతున్నారు. అభాండాలు వేయడం టీడీపీకి అలవాటుగా మారిందన్నారు. రాష్ట్రంలో కక్షసాధింపు పాలన నడుస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అక్రమ నివాసాన్ని కాపాడేందుకు బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడను ముంచేశారని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు.