ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స గెలుస్తారు

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
 

విశాఖ:  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ అత్యధిక మెజారిటీతోగెలుస్తారని పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవడానికి కావాల్సిన సంఖ్యాబలం మాకు ఉందని స్పష్టం చేశారు. 

ఓటుకు నోటు ఆరాధ్యుడు చంద్రబాబు:  మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌
ఓటుకు నోటు ఆరాధ్యుడు చంద్రబాబు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విమర్శించారు. ఎన్నిక ఏదైనా చంద్రబాబు ప్రలోభాలకు తెరతీస్తారని ధ్వజమెత్తారు. ప్రలోభలకు పేటెంట్‌ హక్కు చంద్రబాబుదే అన్నారు. ఎన్నికల్లో బలం లేకపోయినా అభ్యర్థిని నిలబెట్టుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రలోభాలకు వైయస్‌ఆర్‌సీపీ నేతలు లొంగరని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

 

Back to Top