వైయస్ఆర్ జిల్లా: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దూసుకుపోతున్నారని కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి అన్నారు. కడప నగరంలోని 40వ డివిజన్ లో నూతనంగా నిర్మించిన హిందూ శ్మశాన వాటిక ప్రారంభోత్సవం, 47వ డివిజన్ లో నూతనంగా నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లు, వాటర్ ట్యాంక్ , పార్క్ భూమి పూజ, 46వ డివిజన్‌లో నిర్మిస్తున్న పార్క్ భూమి పూజ, 13, 11వ డివిజన్ లోని వై జంక్షన్ టు అంబేద్కర్ సర్కిల్ వరకు రోడ్డు విస్తరణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషతో కలిసి కడప పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థలతో ప్రజల ముంగిటకు పాలనను తీసుకువచ్చిన ఘనత వైయస్ జగన్‌కే దక్కిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచిందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం నవరత్నాల పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కడప నగర మేయర్, వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు కే సురేష్ బాబు, కమలాపురం శాసనసభ్యులు పి. రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి , కడప నగరపాల సంస్థ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, డివిజన్ ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు.