రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  విజయసాయిరెడ్డి

విశాఖపట్నం: రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. విశాఖలో శుక్రవారం  ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీలో ఏర్పాటు చేసిన ఈ రక్త దాన శిబిరాన్ని  విజయసాయిరెడ్డి ప్రారంభించారు.  ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా మహమ్మారికి గురికాకుండా మనం అండగా నిలబడాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారని తెలిపారు. విశాఖలో కరోనా బారిన పడిన రోగుల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. వలంటీర్లు, స్వచ్ఛంధ సంస్థల ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రక్తం కొరత లేకుండా నిల్వ ఉండడానికీ రక్తదాన శిభిరాన్ని నిర్వహించామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మోపిదేవి వెంకట రమణ, పలువురు వైయస్‌ఆర్‌సీపీ నేతలు పాల్గొన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top